పవన్ కల్యాణ్ కు రేపిస్టుల ప్రాణాలు ముఖ్యమైపోయాయి: విజయసాయి రెడ్డి

  • ఆయన మానసిక స్థితిలో ఏదో సీరియస్ ప్రాబ్లమ్ ఉన్నట్టే
  • పవనిజం అంటే ఇదేనేమో? 
  • రాజకీయ పార్టీ పెట్టింది ఇందుకేనా? 
అత్యాచారం చేసిన వారికి ఉరిశిక్ష ఎలా వేస్తారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. ఆయనకు ఏదో మానసిక సమస్య ఉందని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు.

'రేపిస్టులకు ఉరిశిక్ష ఎలా వేస్తారని ప్రశ్నిస్తున్నాడంటే మానసిక స్థితిలో ఏదో సీరియస్ ప్రాబ్లమ్ ఉన్నట్టే. దేశమంతా కఠినంగా శిక్షించాలని కళ్లలో నీళ్లు పెట్టుకుంటుంటే ఈయనకు రేపిస్టుల ప్రాణాలు ముఖ్యమైపోయాయి. పవనిజం అంటే ఇదేనేమో? రాజకీయ పార్టీ పెట్టింది ఇందుకేనా?' అని విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. కాగా, దిశ హత్యాచారం కేసులో దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే. నిందితులకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ వస్తోంది.
Go Back to Shorts
Vijay Sai Reddy
Pawan Kalyan
Jana Sena
YSRCP

More Telugu News